ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదివారం హీరో ప్రభాస్‌ను కలిసి ఆహ్వానం అందించారు. బ్రహ్మోత్సవాల వివరాలను వివరించారు. కాగా ఫిబ్రవరి 21 నుంచి మహాశివరాత్రికి ఆలయం ముస్తాబవుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నితిన్, తదితర రాజకీయ నాయకులకు ఆహ్వానం అందించారు.