TG: మేడ్చల్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపైనే ఉమేష్(22) అనే వ్యక్తిని గుర్తు తెలియని ఇద్దరు యువకులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.