హీరామండితో ఆ కోరిక తీరింది: సోనాక్షి సిన్హా

79చూసినవారు
హీరామండితో ఆ కోరిక తీరింది: సోనాక్షి సిన్హా
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'హీరామండి: ద డైమండ్ బజార్' సిరీస్‌లో 'ఫరీదా' పాత్రలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలను పంచుకున్నారు. 'నాకు నెగెటివ్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక. అది హీరామండితో తీరింది. ఇందులో విలన్‌గా కనిపించడం నాకు బాగా నచ్చింది' అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్