బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇవాళ తెల్లవారుజామున కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆయన ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.