కర్ణాటకలోని మంగళూరులో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఉప్పినంగడికి చెందిన చేతన్ (24), కొడికల్‌కు చెందిన కాశీనాథ్ (17) బైక్‌పై వేగంగా దూసుకెళ్లారు. హరిపడవు ప్రాంతం వద్ద రోడ్డుపై లారీ వెనక్కి రావడం గమనించారు. దానిని తప్పించబోయే క్రమంలో వారి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చేతన్, కాశీనాథ్ ఇద్దరూ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.