విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. టేకాఫ్‌ను నిలిపివేసిన అధికారులు

56చూసినవారు
విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. టేకాఫ్‌ను నిలిపివేసిన అధికారులు
ఎయిర్‌ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం ఇవాళ ఉదయం గోవా నుంచి ముంబైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. దబోలిమ్‌ విమానాశ్రయంలో ఉదయం 6:45 గంటల సమయంలో టేకాఫ్‌ కోసం రన్‌వేపైకి వెళ్లింది. ఆ సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానం టేకాఫ్‌ను రన్‌వే వద్ద నిలిపివేసినట్లు విమానాశ్రయంలో సీనియర్‌ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్