ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల బడ్జెట్

61చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల బడ్జెట్
వచ్చే ఏడాది పాకిస్థాన్ అతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి 70 మిలియన్ డాలర్ల (రూ.584 కోట్లు) బడ్జెట్‌కు ఐసీసీ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఐసీసీ ఆర్థిక శాఖ సంయుక్తంగా రూపొందించిన బడ్జెట్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా నేతృత్వంలోని ఆర్థిక, వాణిజ్య కమిటీ ఆమోదించింది. ఇక అదనపు ఖర్చులకు మరో 4.5 మిలియన్ డాలర్లు (రూ.34 కోట్లు) కేటాయించినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్