బైక్ ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు.. వీడియో

59చూసినవారు
అతి వేగంగా వాహనాలు నడిపి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలోనే అమాయక ప్రజలను ప్రమాదంలో పడేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కారు రద్దీగా ఉన్న రోడ్డుపై వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఓ బైక్ ను తప్పించబోయి ఎదురుగా వచ్చిన బుల్లెట్ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఆ కారు రోడ్డుపై మూడు పల్టీలు కొట్టి ఆగింది. ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్