వాగులో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురి హాహాకారాలు!

53చూసినవారు
వాగులో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురి హాహాకారాలు!
భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. వేలేరుపాడు మండలంలో ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన కారులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు ఉన్నారు. రక్షించాలని వారంతా హాహాకారాలు చేసినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిదూరం వెళ్లాక కారు నుంచి బయటకు వచ్చి వాగులోని పొదల్లో ఆ ఐదుగురూ చిక్కుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, గజ ఈతగాళ్లను రప్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్