దేశంలో 4 ఏళ్లుగా వాయిదా పడిన జనగణన సెప్టెంబరు నుంచి ప్రారంభం

558చూసినవారు
దేశంలో 4 ఏళ్లుగా వాయిదా పడిన జనగణన సెప్టెంబరు నుంచి ప్రారంభం
దేశంలో సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల కార్యక్రమం సెప్టెంబరు నుంచి ప్రారంభం కానుంది. పదేళ్లకు ఒకసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2021లోనే నిర్వహించాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. అప్పటి నుంచి పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వచ్చే నెల నుంచి జనాభా లెక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ జనగణన సెప్టెంబర్‌లో ప్రారంభం అయితే.. పూర్తి కావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్