మహిళని చూసి కన్నుకొట్టిన యువకుడికి రూ.15 వేలు జరిమానా వేసిన కోర్టు

562చూసినవారు
మహిళని చూసి కన్నుకొట్టిన యువకుడికి రూ.15 వేలు జరిమానా వేసిన కోర్టు
ఓ మహిళను అసభ్యకరంగా తాకి కన్నుకొట్టిన యువకుడికి కోర్టు రూ.15 వేలు జరిమానా విధించింది. ఈ ఘటన దక్షిణ ముంబైలోని బైకుల్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గ్రోసరీ సామాన్లు డెలివరీ చెయ్యడానికి వెళ్లిన యువకుడు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసు విచారించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. వాస్తవానికి ఆ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధించాలని భావించిన కోర్టు, అతడికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో జరిమానా మాత్రమే విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్