AP: వైసీపీ నేత పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులనే జారీ చేసింది. కాగా రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.