నిరుద్యోగుల కల ప్రత్యేక రాష్ట్రంలో నెరవేరలేదు: భట్టి

83చూసినవారు
నిరుద్యోగుల కల ప్రత్యేక రాష్ట్రంలో నెరవేరలేదు: భట్టి
నిరుద్యోగుల కల ప్రత్యేక రాష్ట్రంలో నెరవేరలేదని, అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే 56 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చిందని తెలిపారు. గ్రూప్‌-1 పరీక్ష రాయాలనే ఆశ, చాలా మందికి గత పదేళ్లలో నెరవేరలేదని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే, ఉద్యోగాలు వస్తాయని యువత నిర్ణయానికి వచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్