బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. చదువుకోవడం లేదని ఆగ్రహించిన తండ్రి తన కొడుకును హతమార్చాడు. 14 ఏళ్ల తేజస్ చదువును నిర్లక్ష్యం చేయడంతో పాటు అప్పుడప్పుడు మాత్రమే స్కూల్‌కి వెళ్లేవాడు. చెడు స్నేహాలతో చదువులను నిర్లక్ష్యం చేశాడు. దీంతో తండ్రి తరుచుగా అతడిపై అసంతృప్తి వ్యక్తం చేసేవాడు. ఈ విషయమై శుక్రవారం రాత్రి తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో కొడుకుని చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు తండ్రిని అరెస్ట్ చేశారు.