శ్రద్ధగా హరే రామ, హరే కృష్ణ స్మరణ వింటున్న వానరం (వీడియో)

57చూసినవారు
హరే రామ.. హరే కృష్ణ స్మరణకు ఓ వానరం తన్మయంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల బద్రీనాథ్ దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ ఒక హోటల్లో భోజనానికి వెళ్లగా కోతి వారిని వెంబడించింది. అది టేబుల్ ఎక్కి వారి పక్కనే కూర్చోవడంతో పక్కనే ఉన్న మహిళ, ఇతరులు హరే రామ.. హరే కృష్ణ స్మరణ ఆరంభించారు. దీంతో కోతి తన్మయత్వంలో ఊగిపోతూ మహిళను హత్తుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్