విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం

56చూసినవారు
విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం
భారతదేశంలో పరీక్ష రాయడమే పరీక్షగా మారిన పరిస్థితి నెలకొంది. నీట్, నెట్, ఇంటర్, ఎంసెట్, గ్రూప్స్ ఇలా పరీక్ష ఏదైనా ప్రతి ప్రశ్నాపత్రమూ లీకవుతుంది. హమ్మయ్య పరీక్ష రాసొచ్చాం, ఫలితాల కోసం ఎదురుచూస్తే చాలు అనుకునే పరిస్థితి లేదు. పరీక్ష కోసం ఏడాదంతా విద్యార్థులు పడిన శ్రమ, తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడ్డ అష్టకష్టాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఏ ప్రశ్నాపత్రం లీకవుతుందో తెలియదు. ఏ పరీక్ష రద్దు చేస్తారో తెలియదు. మొత్తంగా అసలు విద్యార్థుల భవిష్యత్ ఏమిటో అర్ధం కాదు.

సంబంధిత పోస్ట్