ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలోని మదన్ పూర్ లో మేక కన్ను ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన 50 ఏళ్ల బగార్ రాయ్ మేకలను బలిచ్చి తర్వాత వాటి మాంసంతో వంటలు చేయించాడు. గ్రామస్థులకు భోజనం పెట్టించి ఆ వంటకాల్లో మేక కన్నును అతను తినగా, గొంతులో ఇరుక్కొని ఊపిరాడలేదు. గమనించిన గ్రామస్థులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.