తెలంగాణలో రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం మార్కెట్ లో నిన్న కొత్త పత్తి క్వింటాల్ కు గరిష్ఠంగా రూ.7,111, మోడల్ ధర రూ.6,500, కనిష్ఠంగా రూ.4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా రూ.7,550, కనిష్ఠ ధర రూ.4,500గా ఉంది. వరంగల్ మార్కెట్ లో గరిష్ఠంగా రూ.7,600, మోడల్ ధర రూ.6,600, కనిష్ఠ ధర రూ.5,500 వరకు పలికిందని, కొత్త పత్తి రూ.7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.