రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

55చూసినవారు
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ నుంచి రైతులకు అన్ని రకాల విత్తనాల సబ్సిడీని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పత్తి, వరి, కంది, పెసర, మొక్కజొన్న, సోయాబీన్, మినుము తదితర విత్తనాలకు 35 నుంచి 65 శాతం సబ్సిడీని వ్యవసాయ శాఖ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కాగా జీలుగ, జనపనార, పిల్లి పెసర మినహా మిగతా విత్తనాలపై సబ్సిడీని గత సర్కారు ఎత్తేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్