సింపుల్‏గా దివంగత కమెడియన్ కూతురి పెళ్లి

81చూసినవారు
సింపుల్‏గా దివంగత కమెడియన్ కూతురి పెళ్లి
ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ దివంగత వివేక్ కుమార్తె తేజస్విని వివాహం కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో గురువారం చెన్నైలో జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహం అనంతరం భర్త భరత్‌తో కలిసి ఆమె తండ్రి జ్ఞాపకార్థం మొక్కలు నాటింది. కాగా, 2021లో గుండెపోటుతో వివేక్ మరణించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్