ఝార్ఖండ్ లోని పలామూ జిల్లాలో తన ఏడాదిన్నర కుమార్తెను నరబలి ఇచ్చిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అటవీప్రాంతంలో బాలిక శరీరం ఛిద్రమై, ఛాతీపై పెద్ద కత్తిగాట్లుతో కనిపించింది. సమీపంలో కాలిన దుస్తులు, గాజులు, కుంకుమ కనిపించాయి. తాను తాంత్రిక విద్యను నేర్చుకొన్నట్లు గీతాదేవి పోలీసులకు తెలిపింది. కుమార్తెను చంపానని, అలాగే వదిలేస్తే మర్నాడు మళ్లీ తానే మంత్రశక్తులతో బతికించేదాన్నని చెప్పుకొచ్చింది.