భారతదేశంలోని కొల్లూరు గనుల నుండి ఉద్భవించిన నాసాక్ వజ్రాన్ని శివుని 'కన్ను' అని కూడా అంటారు. ఇది ఒకప్పుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో శివుని కిరీటంపై అమర్చబడింది. ఆంగ్లో-మరాఠా యుద్ధం తర్వాత ఈ వజ్రం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు లెబనీస్ బిలియనీర్ ఆధీనంలో ఉన్న ఓ ప్రైవేటు మ్యూజియంలో ఉంది. నీలిరంగులో ఉండే ఈ డైమండ్ 43.38 క్యారెట్ల బరువు ఉంటుంది.