హత్యకు ముందు ప్రాణాల కోసం వేడుకుంటూ కన్నీటి పర్యంతమైన రేణుకాస్వామి ఫొటోలు వైరల్‌

76చూసినవారు
హత్యకు ముందు ప్రాణాల కోసం వేడుకుంటూ కన్నీటి పర్యంతమైన రేణుకాస్వామి ఫొటోలు వైరల్‌
కర్ణాటకలో సంచలనం సృష్టించిన సినీ నటుడు దర్శన్‌ తూగుదీప అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కీలకమైన ఫొటోలు వైరల్‌గా మారాయి. దర్శన్‌, అతడి అనుచరులు రేణుకా స్వామిని ఓ లారీ ఎదుట ఒంటిపై చొక్కా లేకుండా కూర్చోబెట్టారు. అతడు ఏడుస్తుండటాన్ని బట్టి తీవ్రంగా కొట్టినట్లు అర్థమవుతోంది. మరో ఫొటోలో రేణుకా స్వామి పడిపోయి ఉండగా చేతిపై కోసిన గాయం కనిపిస్తోంది. నిందితుల్లో ఒకరి సెల్‌ఫోన్‌ నుంచి ఈ చిత్రాలను దర్యాప్తు బృందం వెలికితీసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్