మాల్దీవుల అధ్యక్షుడి తీరు మారలేదు!

61చూసినవారు
మాల్దీవుల అధ్యక్షుడి తీరు మారలేదు!
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు.. మరోసారి భారత్‌పై తన వ్యతిరేకతను ప్రదర్శించారు. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వచ్చిన ముయిజ్జు మన నేతలతో కరచాలనాలు చేస్తూ.. అభినందనలు తెలిపారు. ఇక్కడ ఆయన పర్యటిస్తోన్న సమయంలోనే మాల్దీవుల పార్లమెంట్‌ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. తమ గత ప్రభుత్వం భారత్‌ చేసుకున్న ఒప్పందాలను సమీక్షించే ఉద్దేశంతో తీసుకువచ్చారు. ఇది రెండు దేశాల సంబంధాలను దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

సంబంధిత పోస్ట్