తెలంగాణలో బతుకమ్మ ఆడిన మహిళలపై రజకారులు దాడులు చేసిన ఘటనలు తరచుగా వింటుంటాం. అయితే హైదరాబాద్‌లో బతుకమ్మ ఆడారని మహిళలకు బంగారునాణాలు ఇచ్చిన రాజు సైతం ఉన్నారట. ఆయనే 6వ నిజాం మహబూబ్ అలీఖాన్. చార్మినార్ వద్ద పురానీ హవేలీలో ఆయన ఉన్నప్పుడు కొందరు మహిళలు బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడటం ఆయనకు వీనులవిందుగా అనిపించి వారికి అష్రఫీ (బంగారు నాణెం) ఇచ్చి, వారిని సత్కరించారట.