పాక్‌లో రూ.370కి చేరిన లీటరు పాల ధర!

75చూసినవారు
పాక్‌లో రూ.370కి చేరిన లీటరు పాల ధర!
పాకిస్థాన్ ప్రజలపై అక్కడి ప్రభుత్వం మరో భారం మోపింది. ప్యాకేజ్డ్ పాలపై 18% పన్ను విధించడంతో ధరలు 25% పెరిగాయి. అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర రూ.370కి చేరింది. ఇది అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లోని ధరల కంటే అధికం. ఈ నిర్ణయంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, పేదరికంలో ఉన్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పాక్‌లో నిత్యావసరాలు, ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్