మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. మూసీ ఒక్కప్పుడు జీవనదిగా ఉండేదని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నీళ్లు, కూరగాయలు, పాలు అన్నీ కలుషితమయ్యాయని.. మూసీ నీటితో పండించిన పంటలకు ధర లభించడం లేదన్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలను కాపాడటం కోసం అనేక సమీక్షలు చేశామని చెప్పారు. ఎంతో మందితో చర్చించిన తర్వాత మూసీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.