వెట్రిమారన్ డైరెక్షన్‌లో నటించనున్న రజినీకాంత్!

74చూసినవారు
వెట్రిమారన్ డైరెక్షన్‌లో నటించనున్న రజినీకాంత్!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కూలీ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా.. జైలర్-2ను ప్రకటించారు. అయితే తాజాగా మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. విలక్షణ దర్శకుడు వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రజినీకాంత్‌కు కథ కూడా వినిపించినట్లు సమాచారం. త్వరలోనే మూవీపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్