ఇస్రో నిర్వహిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్రామ్ 'యూవికా'కు ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఈ క్రమంలో మార్చి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో అధికారికంగా ప్రకటించింది. కాగా 8వ తరగతి పూర్తయిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి మే నెలలో 2 వారాల పాటు స్పేస్ టెక్నాలజీ, సైన్స్‌లో శిక్షణ ఉంటుంది.