లక్షల లీటర్ల పెట్రోల్‌తో వెళ్తున్న ఓ రైలు భారీ ప్రమాదానికి గురయ్యింది. కొలంబో నుంచి బట్టికలోవాకు వెళ్తున్న రైలు మిన్నేరియా రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చింది. పట్టాలపై ఉన్న ఏనుగుల గుంపును చూసిన లోకోపైలట్ సడన్ బ్రేకులు వేశారు. దాంతో రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు బోగీల్లో పెట్రోల్ పూర్తిగా ఒలికిపోయింది. మిగతా బోగీల నుంచి ఇంధనాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు చనిపోగా, మిగతా వాటికి గాయాలయ్యాయి.