ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. రాజ్‌గీర్ మిస్త్రీ అనే వ్యక్తికి కడుపులో నొప్పి రావడంతో అతను ఉచిత హెర్నియా తనిఖీ శిబిరానికి వెళ్లాడు. అక్కడ డాక్టర్ నరేంద్ర దేవ్ టెస్టులు చేసి.. హెర్నియా ఆపరేషన్ చేయించుకోవాలని సూచించాడు. అనంతరం డాక్టర్ దేవ్ పర్యవేక్షణలో మిస్త్రీకి శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలో పొత్తికడుపులో అభివృద్ధి చెందని గర్భాశయం.. దాని ప్రక్కనే అండాశయం ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి దానిని తొలగించారు.