ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నరైనీ కొత్వాలిలోని కర్తాల్ చౌకీ ప్రాంతానికి చెందిన లల్లూకి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే..లల్లూ భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అర్థరాత్రి సమయంలో ప్రియుడితో వెళ్లిపోయింది. అది గమనించిన ఆమె భర్త భారీ స్కెచ్ వేశాడు. వారిపై నేరాన్ని మోపేందుకు పిల్లలు, అతడి తల్లి ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పంటించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి వారని కాపాడారు. దీనిపై విచారణ జరపగ నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.