పంతం పట్టిన మహిళ.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి (వీడియో)

54చూసినవారు
చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్తానని పంతం పట్టిన మహిళ.. ఐదేళ్ల తర్వాత ఆమె ఇంటికి వెళ్లింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురానికి చెందిన విజయలక్ష్మి తన పుట్టింటికి వచ్చారు. అది కూడా ఐదేళ్ల తర్వాత. ఏపీకి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఆమె పుట్టింటికి వెళ్తానని గతంలో ప్రతిన పూనారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పుట్టింటికి వచ్చిన విజయలక్ష్మిని కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్