71 ఏళ్ల వయసులో ఓ బామ్మ అద్భుతం చేసింది. ఫిట్‌నెస్ విషయంలో ఈ కాలం అమ్మాయిలకు పోటీగా నిలిచింది. జిమ్ లో ఆమె చేసున్న వ్యయమాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. Xలో 10 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ మేరకు 2017లో ఆమె 71 ఏళ్ల వయస్సులో వ్యాయామాలు చేయడం ప్రారంభించింది. అప్పుడు బొద్దుగా ఉన్న బామ్మ నిబద్ధతతో రోజు వ్యాయామాలు చేస్తూ వచ్చింది. ఇలా 2024 వరకు అంటే ఆమెకు 78 ఏళ్ల వయసులో కండలు తిరిగిన దేహాన్ని పొంది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.