అక్కడ పెరుగుతున్న జికా వైరస్ కేసులు

85చూసినవారు
అక్కడ పెరుగుతున్న జికా వైరస్ కేసులు
పూణేలో జికా వైరస్ కేసుల సంఖ్య 15కు చేరింది. బాధితుల్లో 8మంది గర్భిణులు, ఓ బాలుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వ్యాధి సోకిన గర్భిణులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొన్నారు. జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తోంది. జ్వరం, దద్దర్లు, కండరాల నొప్పులు, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్