సూపర్ హీరోలను సినిమాల్లోనే చూడాల్సిన అవసరంలేదని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. నిజజీవితంలోనూ మన కళ్లముందే ఉంటారని చెప్పారు. ‘అలాంటి కోవకు చెందినవారే భారత ఆర్మీఇంజినీర్ సీతాషెల్కే, వయనాడ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల కోసం ఆమె తన బృందంతో కలిసి 36 గంటలపాటు ఏకధాటిగా శ్రమించి 190 అడుగుల వంతెనను నిర్మించారు. మేజర్ హోదాలో సీతా సారథ్యం వహించి నారీశక్తి చాటారు’ అని ప్రశంసించారు.