ముద్ర రుణాలు పొందాలంటే.. ప్రభుత్వం జారీ చేసిన ఒక గుర్తింపు కార్డు, ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఇటీవల దిగిన పాస్ పోర్టు సైజు కలర్ ఫొటోలు 2 కాపీలు. కొనుగోలు చేయవలసిన యంత్రాలు, పరికరాలకు సంబంధించిన కొటేషన్. మీ వ్యాపార సంస్థ కార్డు, అడ్రస్, సంబంధిత లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, సంస్థ యాజమాన్యానికి సంబంధించిన ఇతర పత్రాలు, వ్యాపార యూనిట్ చిరునామా ఉండాలి.