భారతీయ వంటకాల్లో మునగకాయకు ఇప్పడు కాదు ఎప్పటినుండో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగ చెట్టులో దాదాపు అన్ని భాగాలకు ఏదొక ప్రయోజనం ఉండనే ఉంది. మన వంటకాల్లో భాగమైన మునగకాడల్లో, ఆకుల్లో ఎన్నో పోషకవిలువలు నిక్షిప్తమై ఉన్నాయి.
పీకెఎం-1, పీకెఎం-2, జాఫ్న, ధనరాజ్ రకాలు మంచి దిగుబడిని అందిస్తున్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే, నాటిన 90-100 రోజుల్లోనే పూతకు వస్తాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాటిన 160 రోజుల్లోగా మొదటికోత లభిస్తుంది.