తెలంగాణాలో కొందరు MLAలపై తాను వేసిన కేసులు విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. గతంలో తనను చంపుతామని బెదిరించి తర్వాత వాళ్ళే పోయారని.. ఇప్పుడు కూడా తనను చంపాలని చూస్తున్నవారు ఖచ్చితంగా చస్తారని అన్నారు. తనని తాను తగ్గించుకున్న వాడు ధన్యుడు.. పవన్‌కళ్యాణ్ అదే అంటాడు కానీ తగ్గడు అని సెటైర్లు వేశారు. ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారని అప్పుడు CBN అన్నాడు, ఇపుడు జగన్ అంటున్నాడని వ్యాఖ్యలు చేశారు.