ఇద్దరు వ్యక్తులు టెక్నిక్‌తో దొంగతనం చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇద్దరు యువకులు బైకు మీద వచ్చి దుకాణం వద్ద ఆగుతారు. ఒక వ్యక్తి షాపులోకి వెళ్లగా, మరో వ్యక్తి రోడ్డుపైన బైక్ మీదనే ఉన్నాడు. షాపులోకి వచ్చిన వ్యక్తి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. డబ్బుల కోసమని.. రోడ్డుపై ఉన్న వ్యక్తి దగ్గరకి వచ్చి, అక్కడ కొద్దీసేపు నిలబడి ఒక్కసారిగా ఇద్దరూ అక్కడి నుంచి పరారవుతారు. వాళ్లు చేసిన నిర్వాకానికి షాపు యజమాని షాకయ్యాడు.