ఇదెక్కడి వింత.. ఆ ఊరిలో పాలు అమ్మకూడదు

139760చూసినవారు
ఇదెక్కడి వింత.. ఆ ఊరిలో పాలు అమ్మకూడదు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కడిమెట్ల గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. చెన్నకేశవ స్వామి వారిని కొలిచే వీరు.. ఆ ఊరిలో పాలు అమ్మితే దేవుడి శాపానికి గురికావాల్సి వస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే ఆ ఊరిలో డైరీలు ఉండవు. ఎవరూ పాలు కూడా అమ్మరు. అయితే చిత్రమేంటంటే, వీరు వేరే ఊరిలో పాలు కొనుక్కోవచ్చు. దీంతో ఎర్రకోట, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాలకు వెళ్లి పాలు కొనుగోలు చేసుకొని గ్రామానికి వస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్