విశాఖ ఉక్కు చరిత్ర ఇదే..

73చూసినవారు
విశాఖ ఉక్కు చరిత్ర ఇదే..
‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి 32 మంది ప్రాణత్యాగాలతో కర్మాగారాన్ని సాధించుకున్నారు. 64 గ్రామాల ప్రజలు 22వేల ఎకరాలను విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇచ్చారు. 1971లో ఇందిరాగాంధీ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయగా.. 1992 ఆగస్టు 8న పి.వి.నరసింహారావు జాతికి అంకితం చేశారు. అనేక బాలారిష్టాల తరవాత 2002 నుంచి స్టీలు ప్లాంట్ లాభాల బాట పట్టింది. 2005-06లో కర్మాగారం సామర్థ్యాన్ని 30 లక్షల టన్నుల నుంచి 73 లక్షల టన్నులకు విస్తరించింది. దీన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయంతో కష్టాలు మొదలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్