ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ ద్వారా సుమారు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. కాగా, ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లేదా ఏకీకృత పెన్షన్ స్కీమ్(UPS) రెండింట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకానికి NPS కింద 2004 నుంచి పదవీ విరమణ చేసిన వారు, మార్చి 31,2025 వరకు పదవీ విరమణ చేయబోయే వారు అర్హులు. రావాల్సిన మొత్తాన్ని ఉపసంహరించుకున్న తర్వాత గత బకాయిలను అందుకుంటారు.