TG: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతోంది. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక అనే ముగ్గురు విద్యార్థినులు నవీపేట్‌లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం స్కూల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.