AP: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో నిర్వహిస్తున్నారు. అయితే సభకు వెళ్లడానికి మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు. పిఠాపురం రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలు పాస్‌లకు ఎంట్రీ ఇస్తున్నారు. డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వీఐపీ, వీవీఐపీ పాస్‌లకు అనుమతిస్తున్నారు. మల్లాడి సత్యలింగం నాయకర్ ద్వారం నుంచి జనసేన కార్యకర్తలకు ప్రవేశం కల్పిస్తున్నారు.