పిడుగు పడి ముగ్గురు హాకీ ఆటగాళ్లు మృతి

75చూసినవారు
పిడుగు పడి ముగ్గురు హాకీ ఆటగాళ్లు మృతి
జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో బుధవారం విషాద ఘటన జరిగింది. హాకీ పోటీల సందర్భంగా పిడుగుపాటుకు గురై చెట్టు కింద నిలబడిన ముగ్గురు క్రీడాకారులు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. మృతులను టుటికెల్ గ్రామానికి చెందిన ఎనోస్ బుద్(22), సెనన్ డాంగ్(33), నిర్మల్ హోరోగా గుర్తించారు. గాయపడిన వారిని కోలెబిరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్