కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి మూడు సూపర్ ఓవర్ల తరువాత ఫలితం తేలిన మ్యాచ్‌గా నిలిచింది. ఈ ట్రోఫీలో భాగంగా హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ ఫలితం మూడు సూపర్ ఓవర్లతో తేలింది. చివరకు ఈ మ్యాచ్‌లో హుబ్లీ టైగర్స్ విజయం సాధించింది.