బొప్పాయి విత్తనాల్లో డైయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు ఈ విత్తనాలు ఉపకరిస్తాయి. బొప్పాయి గింజల్లో విటమిన్ సీ మెండుగా ఉంటుంది. ఇవి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. బొప్పాయి విత్తనాల్లో ఉండే కార్పైన్, ఫైబర్.. పేగుల కదలికలను నియంత్రిస్తాయి. దీని ద్వారా మలబద్ధకం తగ్గేందుకు ఉపకరిస్తాయి. బొప్పాయి గింజలను నేరుగా కాకున్నా సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తీసుకోవచ్చు.