సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తీన్మార్ మల్లన్న

60చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తీన్మార్ మల్లన్న
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన పుష్పగుచ్చం అందజేశారు. కాగా, ఇటీవల నిర్వహించిన వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్