కౌలాలంపూర్‌లో తెలుగు మహిళ కోసం కొనసాగుతున్న రెస్క్యూ

64చూసినవారు
కౌలాలంపూర్‌లో తెలుగు మహిళ కోసం కొనసాగుతున్న రెస్క్యూ
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో గల్లంతైన ఏపీకి చెందిన విజయలక్ష్మి(45)ను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మ్యాన్‌హోల్‌ వద్ద జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే, మ్యాన్‌హోల్‌లో జల ప్రవాహం అధికంగా ఉండటంతో ఆమె కొట్టుకుపోయి ఉంటారని స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతున్నప్పటికీ ఆమె ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్